పురాతన వీరభద్ర ఆలయాన్ని దర్శించుకున్న డి సి ఎస్ ఓ….

కొల్చారం అక్టోబర్ 22( అక్షర కలం వెబ్ ):-

కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానందం బుధవారం మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం లోని పురాతన వీరభద్ర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వయంగా ఆకాశ దీపాన్ని వెలిగించి జ్యోతి దర్శనం చేసుకున్నారు. కార్తీక మాసం నెలరోజుల పాటూ ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపాన్ని వెలిగించాలని పూజారిని కోరారు. ఈ నెల రోజులపాటు జ్యోతి ప్రజ్వలనకు కావలసిన నూనె తదితర సామాగ్రిని తానే స్వయంగా అందిస్తానని తెలిపారు. అనంతరం మాట్లాడుతూ పురాతన ఆలయాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వీలు చిక్కినప్పుడు మళ్లీ వీరభద్రుడి దర్శనం చేసుకుంటానన్నారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అధికారుల్ని శాలువాతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారి తమ గ్రామంలోని పురాతన ఆలయాన్ని గుర్తించి దర్శించుకోవడం సంతోషకరమని, ఇది తమ గ్రామానికి వచ్చిన ప్రత్యేక గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ర్యాగల్ల ఆనంద్, శ్రీధర్ గౌడ్, చౌరి గారి భాస్కర్, ర్యాగల్ల శ్రీనివాస్, నితిన్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.