*అన్నా రండి…! హార్ట్లీ వెల్కమ్….!!

అక్షర కలం/ ఖమ్మం ప్రతినిధి:

ఖమ్మం : అన్నా రండి…! హార్ట్లీ వెల్కమ్…!! అంటూ తొలిసారి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి, ఉమ్మడి ఖమ్మంజిల్లా ఇన్ చార్జి మంత్రిగా ఉన్న వాకిటి శ్రీహరికి తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఘనస్వాగతం పలికారు. కొత్తగూడెం నియోజకవర్గ పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తున్న వాకిటి శ్రీహరిని తన క్యాంపు కార్యాలయానికి రావాలని మంత్రి పొంగులేటి ఆహ్వానించారు. తన ఆహ్వానం మేరకు విచ్చేసిన వాకిటికి శాలువా కప్పి మెమోంటోతో ఘనంగా పొంగులేటి సత్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మంజిల్లా విశేషాలు మంత్రి పొంగులేటి శ్రీహరికి వివరించారు. పొంగులేటి ఆతిథ్యాన్ని స్వీకరించిన శ్రీహరి శీనన్న ఆతిథ్యం బేష్ అని కితాబిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.