*మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*
*ఉప్పల్ చిలకనగర్ లో జరిగిన బోనాల పండుగలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి*
*ఘనంగా స్వాతం పలికిన స్థానిక ఎమ్మెల్యే, పార్టీ శ్రేణులు, భక్తులు*
హైదరాబాద్: అక్షర కలం
*రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ చిలుకనగర్ లోని బోనాల జాతర,పలహారం బండి ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి*
*ఈ సంబురాల్లో పాల్గొన్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,మంత్రి అభిమానులు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,పలువురు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు*.
*మంత్రి ప్రారంభించిన పలహారం బండి ఊరేగింపు భక్తుల కోలాహలం నడుమ ఉత్సాహభరితంగా సాగింది*.
ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ…అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు పూర్వ కాలంలో మాసూచి,మలేరియా, ఫ్లేగు లాంటి వ్యాధులు సోకితే అమ్మవారికి బోనం సమర్పించి వ్యాధి నయం చేయాలని మొక్కలు చెల్లించారని చెప్పారు అమ్మవారి కృపతో అందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు మంత్రి పేర్కొన్నారుబోనాల జాతర, పలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించిన నిర్వాహకులకు మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా,ఎంపీగా,రాష్ట్ర మంత్రిగా ఈ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.భువనగిరి,నల్గొండ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఉప్పల్ ప్రాంతంలో ఉన్నారని అన్నారు*. *ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు తనకు అభిమానులుగా ఉన్నారని..వారి అభిమానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,కాంగ్రెస్ నేత పరమేశ్వర రెడ్డి,మాజీ ఎమ్మెల్యే NVS ప్రభాకర్,స్థానిక నాయకులు,పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.