ఐదు రోజుల్లో జిల్లాలో భారీ వర్షపాతం నమోదు

  • పక్క ప్రణాళికతోనే ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాo
  • నిజామాబాద్ నీటిపారుదల శాఖ సీఈ మధుసూదన్ రావు

బతుకమ్మ, నిజామాబాద్ –గడిచిన ఐదు రోజులుగా జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అయిందని నిజామాబాద్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఆర్.మధుసూదన్ రావు తెలిపారు. నీటి పారుదల శాఖ ఆధీనంలో ఉన్న 1086 పెద్ద, చిన్న చెరువులు, 51 చెక్ డ్యామ్ లు, రామడుగు ప్రాజెక్ట్ , శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరిందన్నారు. పెద్ద వాగు, కప్పల వాగు, పసుపు వాగు, పూలాంగ్ వాగు పరివాహక ప్రాంతాలలో అధిక వర్షపాత కారణంగా ఈ వాగులలోకి వరద వెల్లువెత్తిందన్నారు. భారీ వర్ష సూచన అందిన వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలో వరద ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి క్షేత్ర స్థాయి అధికారుల సహాయంతో నీటి పారుదల శాఖ సమర్ధవంతంగా పక్కా ప్రణాళికతో, ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా నిర్వహించిందన్నారు. జిల్లాలో అన్ని ప్రాజెక్ట్ లు, చిన్న నీటి వనరులలోకి నీరు చేరి నిండు కుండని తలపిస్తున్నాయన్నారు. నిజామాబాద్ వరప్రధాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిండడం ద్వారా ఈ ఖరీఫ్, రబీ పంటలకు ఏ డోకా లేదు. ప్రస్తుత ఖరీఫ్, రబీ, త్రాగు నీటి అవసరాలకు ప్రణాళికతో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.