మీసాల వర్సెస్ నాగోళ్ల

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పర్యటనలో బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన కార్పొరేటర్ మీసాల సవిత భర్త మీసాల శ్రీనివాస్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ మధ్య గొడవ రాజుకుంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు భార్య సవితతో కలిసి వచ్చిన శ్రీనివాస్ కారు నిలిపి అక్కడే ఉన్న ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన లక్ష్మీనారాయణ మీసాల శ్రీనివాస్ కారు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు పక్కకు తీసి మాట్లాడుకోవాలని విరుచుకుపడ్డారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

 

Leave A Reply

Your email address will not be published.