*ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలి*

*చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

(అక్షర కలం వెబ్) , మంచిర్యాల జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 18

నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ తెలిపారు. గురువారం జిల్లాలోని మందమర్రి మండలం క్యాతనపల్లిలోని ఆయన నివాసంలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను బాల్క సుమన్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో పార్టీ కేటాయించిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎన్నికల్లో ఓడిన వారికి పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.