చిట్యాల: అక్షర కలం (ప్రతినిధి)
జాతీయ భారత ప్రముఖ హాకీ క్రీడాకారుని ధ్యాన్ చంద్ జన్మదినం పురస్కరించుకొని శుక్రవారం రోజున నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ధ్యాన్ చంద్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశానికి హాకీ క్రీడలో తను చేసిన సేవలకు గుర్తుగా అతని జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా భారత ప్రభుత్వం 2012 నుండి జరుగుతుందని అన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కీర్తిని చాటి చెప్పాడని , ఆటల వల్ల వినోదంతో పాటు శారీరక మానసిక రుగ్మతలను దగ్గరికి రాకుండా ఉంటాయని అన్నారు. విద్యార్థులకు క్రీడల వల్ల ఉన్నత ఉద్యోగాలు కూడా సంపాదించుకోవచ్చు అని, విద్యతోపాటు క్రీడలు కూడా ప్రతి విద్యార్థికి అవసరమని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పోల గోవర్ధన్, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకున్నారు