చిట్యాల మండలం వెలిమినేడు వద్ద మరో ఘోర బస్సు ప్రమాదం

* తృటిలో తప్పించుకున్న 29 మంది ప్రయాణికులు

చిట్యాల: (అక్షర కలం వెబ్ , ):

ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాలకు గురై ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మరవక ముందే నల్గొండ జిల్లా చిట్యాల మండలం లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో 29మంది ప్రయాణికులుతృటిలో తప్పించుకొని సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున చిట్యాల మండలం వెలిమినేడు పిట్టంపల్లి స్టేజి వద్ద హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న విహారి ట్రావెల్స్ సంబంధించిన ఎన్.ఎల్ 01. బి 3250 నెంబర్ గల బస్సు ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో బస్సు ఇంజన్ లో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఇంజన్ లో మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై మెయిన్ డోర్ తో ఎమర్జెన్సీ డోర్ తెరుచుకొని ప్రయాణికులను బస్సు నుండి కిందికి దింపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది అలా ప్రయాణికులు బయటికి దిగిన ఐదు నిమిషాలకే విహారి ట్రావెల్స్ బస్ మంటల్లో పూర్తిగా దగ్ధం అయింది.

ఈ సంఘటనతో మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకుల నిర్లక్ష్యం నిర్వాకం బయటపడింది. వీరికి కేవలం ప్రజల నుండి చార్జీలు వసూలు చేయడమే తప్ప ప్రయాణికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతుందని ప్రయాణికులు ఆరోపించారు. ఇప్పటికైనా ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.