నారాయణపేట జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 02, (అక్షర కలం వెబ్ ):
నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో గల ఆర్టీసీ బస్టాండ్ ముందు వెలిసిన హజ్రత్ మహబూబ్స్వాని గంధ మహోత్సవాలు ఈనెలమూడున అనగా శుక్రవారం రాత్రి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు

మహమ్మద్ కరీం ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి మహోత్సవాలకు మరికల్ మండల కేంద్రంలోని మహబూబ్ స్వాని భక్తులు గంధ మహోత్సవాలకు హాజరు కావాలని ఆయన తెలిపారు. భక్తులు భారీ ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.