బతుకమ్మ, భీంగల్ : బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పలువురు భాదిత కుటుంబాలను ఆదివారం పరామర్శించారు.ఇందులో భాగంగా వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామానికి చెందినకాంగ్రెస్ నాయకులు బుల్లెట్ రమేష్ వాళ్ళ అన్నయ్య ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భీంగల్ మండలం రహత్ నగర్ కాంగ్రెస్ నాయకుడు సేవాలాల్ వాళ్ళ తమ్ముని భార్య ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను, దేవక్కపేట్ గ్రామ కాంగ్రెస్ నాయకుడు సాయిలు వాళ్ళ మామ ఇటీవలే మరణించిగా వారి కుటుంబ సభ్యులను సునీల్ కుమార్ పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట నియోజకవర్గ, మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.