నిందితులను కఠినంగా శిక్షించాలి

  • పి డి ఎస్ యూ -పి ఓ డబ్ల్యూ డిమాండ్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, సుప్రీంకోర్టు జడ్జిచె న్యాయ విచారణ చేపట్టాలని, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో నిందితుడి దిష్టిబొమ్మను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల మహిళా సంగం ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా పి ఓ డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. సంద్యా రాణి, పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ కలకత్తా నగరంలో డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ పై కొందరు దుండగులు చేసిన అత్యాచార నిందితులను గుర్తించి వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.  సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేసి మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు.
వైద్య విద్యార్థిని కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం మోద్దు నిద్ర వీడట్లేదన్నారు. విద్యార్థులు చదువుకున్న ప్రాంతంలో, మహిళలు పని చేసే ప్రాంతాల్లో ఏదో రకంగా వేధిస్తూన్నారాన్నారు. చట్టాలు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లకు చుట్టాలుగా మారుతున్నాయని, ఆ విధంగా కాకుండా సుప్రీంకోర్టు జడ్జి న్యాయ విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మానవ విలువలు పెంపొందించే విధంగా విద్యా ప్రమాణాలు ఉండాల్సిందిగా ప్రభుత్వాలను, విద్యావంతులను,ప్రజలను కోరారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. భారతదేశంలో ఎక్కడో ఒకచోట మహిళలపై, విద్యార్థినిలపై,పసి పాపలపై దాడులు జరుగుతూనే ఉండడం, నిందితున అరెస్టు చేయడం, సభ్య సమాజం తలదించుకునే విధంగా మన దేశంలో ఈ విధంగా ఘటనలు జరగడం చాలా సిగ్గుచేటన్నారు. యువతులను కేవలం సెక్స్ బొమ్మలుగా చూపించే చిత్రాలపై కనిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. అదేవిధంగా యువత పెడదారి పట్టడానికి అతి ముఖ్యమైన విషయం డ్రగ్స్, గంజాయి మత్తు పానీయాలు, వీటిని అరికట్టే విధంగా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు సృజన్, నసిర్, ప్రణయ్, వివేక్ పి ఓ డబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి గౌర, జిల్లా కమిటీ సభ్యులు కీర్తన, నాయకులు అమూల్య, లలిత,సౌజన్య,అంబిక,పద్మ, స్వప్న,స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.