ఏడుపాయల్లో మహిళా పై దారుణం…

– వివరాలు సేకరిస్తున్న పోలీసులు….

కొల్చారం, అక్టోబర్ 11 ( అక్షర కలం వెబ్ ):- 

మెదక్ జిల్లా కొల్చారం మండలం ఏడుపాయల వెళ్లే దారి మొదటి బ్రిడ్జి దాట గానే ఒక మహిళపై దారుణం చోటుకు చేసుకుంది. మెదక్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఒక గిరిజన మహిళను గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళా చనిపోయిందనుకుని ఆమె చీరతో చెట్టు కట్టేసి దుండగులు వెళ్లిపోయారు. తెల్లవారుజామున అటువైపు చూసిన వారు సమాచారం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న మెదక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అత్యాచారానికి గురైన మహిళను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలిని మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్, మెదక్ రూరల్ సీఐ జార్జ్, కొల్చారం, పాపన్నపేట ఎస్సైలు అహ్మద్ మొయినుద్దీన్, శ్రీనివాస్ గౌడ్ సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.