ఆర్టీసీ ఆర్‌ఎంను కలిసిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నూతన కమిటీ

అక్షరకలం నల్గొండ

టీజిఎస్ ఆర్టిసి నల్లగొండ రీజియన్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రీజియన్ నూతన కమిటీని సోమవారం రీజియన్ మేనేజర్ టి. జ్యోత్స్న కు అధికారికంగా పరిచయం చేశారు. రాష్ట్ర కమిటీ ముఖ్య సలహాదారులు గడ్డం శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు కె.వి. చంద్రకళ, అదనపు ప్రధాన కార్యదర్శి కడియం రమేష్ ఈ నూతన కమిటీని ఆర్ఎంకు పరిచయం చేయడం జరిగింది.

​ఈ సందర్భంగా రీజియన్ కమిటీ అధ్యక్షులు కొర్ర లింగ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ బండారు జానకిరాములు, కార్యదర్శి పి. యాదయ్య, డెప్యూటీ కార్యదర్శి వంటెపాక అనిల్ ఆర్ఎంను బొకే, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ పరిచయ కార్యక్రమంలో మిర్యాలగూడ డిపో అధ్యక్ష, కార్యదర్శులు దైద బాల, డి. భాగ్యరాజు, నార్కట్‌పల్లి డిపో అధ్యక్ష, కార్యదర్శులు బి. రామచంద్రం, లింగాల వేణుగోపాల్, సూర్యాపేట డిపో అధ్యక్ష, కార్యదర్శులు పి. విజయభాస్కర్, ఎం. అనిల్ కుమార్, అలాగే యాదగిరిగుట్ట డిపో డెలిగేట్ డి. యాదయ్య తదితరులు పాల్గొన్నారు. “బోధించు, సమీకరించు, పోరాడు” అనే నినాదంతో ఈ అసోసియేషన్ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తుందని నాయకులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.