దశలవారీ గా ఆందోళన కార్యక్రమాలు

–జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీపై విద్యాశాఖ నిర్లక్ష్యం

— ఈనెల 6న నిరసనలు 

—జర్నలిస్టులకు, టీయూడబ్ల్యూజే సభ్యులకు, బాధ్యులకు గార్లపాటి కృష్ణారెడ్డి పిలుపు 

–మండల, డివిజన్, నియోజకవర్గ, జిల్లా కేంద్రం లో ఎక్కడికక్కడ నిరసన

— అధికారులకు వినతి పత్రాలు 

అక్షరకలం నల్లగొండ

  నల్లగొండ జిల్లాలో జర్నలిస్టు కుటుంబ సభ్యుల పిల్లల పాఠశాల విద్య కోసం ఫీజు రాయితీ సర్కులర్ జారీ చేయడంలో విద్యాశాఖ నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 6న అన్ని మండల, డివిజన్, నియోజకవర్గ, జిల్లా కేంద్రంలో నిరసనలు, ధర్నాలు చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేయాలని టి యు డబ్ల్యూ జె ( ఐజేయు )జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కలెక్టరేట్ లో డిఆర్ఓకు, జిల్లా విద్యాశాఖ అధికారికి జూన్ 5వ తేదీన వినతిపత్రం సమర్పించడం జరిగిందని పేర్కొన్నారు. అయితే పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా ఫీజు రాయితీ సర్కులర్ ఇవ్వడంలో కాలయాపన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాలలో సర్కులర్ ఇవ్వగా, నల్లగొండ జిల్లాలో మాత్రం కమిషనరేట్ నుంచి అనుమతి రావాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొనడం విచారకరమన్నారు. సర్కులర్ జారీ అయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా టి యు డబ్ల్యూ జే (ఐ జే యు ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమాలలో జిల్లాలోని జర్నలిస్టులతో పాటు టియుడబ్ల్యూజే సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.