కొలువుదీరిన పాలకవర్గం

బతుకమ్మ, నిజామాబాద్ : కోటగిరి ఉమ్మడి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ హనుమంతుకు ఈ గౌరవం దక్కిందన్నారు. ఈ సందర్భంగా చైర్మన్, పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల అధ్యక్షులు షహీద్, మాజీ జెడ్పిటిసి పుప్పాల శంకర్, మాజీ ఎంపీపీ పవన్ కుమార్, కామారెడ్డి జిల్లా మైనారిటీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, రుద్రూర్, వర్ని, మోస్రా, బీర్కూర్ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, లక్ష్మణ్, సురేష్ బాబా, శంకర్, ఎజాస్, సాయిలు, కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

A measured ruling class

Leave A Reply

Your email address will not be published.