నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి….

 

అక్షర కలం /ప్రతినిధి:

జిల్లాలో మత్తుమందుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా స్థాయి మత్తుమందుల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువత మత్తుమందులకు బానిస కాకుండా అన్ని స్థాయిలలో అవగాహన కల్పించాలని, నల్గొండ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా చేసేందుకు పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత అందరిలో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రత్యేకించి రైతులు ఎక్కడ గంజాను ఎట్టి పరిస్థితులలో సాగు చేయవద్దని ,ఒకవేళ ఎవరైనా సాగు చేసినట్లు తమ దృష్టికి వస్తే అవసరమైతే రైతుబంధును నిలిపివేస్తామని చెప్పారు. 70 మంది గంజాయిని వినియోగిస్తున్న వారిని గుర్తించడం జరిగిందని,ఇటీవల 300 కేజీల గంజాయిని పట్టుకొన్నామని, గతంలో గంజాయి వినియోగించే వారిపై కేసులు నమోదు చేయలేదని, ఇకపై వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలలో మాదక ద్రవ్య నిర్మూలన కమిటీలను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ఎక్కడైనా గాంజా గుర్తించినట్లయితే తక్షణమే తమకు సమాచారం అందించాలని కోరారు. అటవీ ప్రాంతాలలో గంజాయి పెంచకుండా అటవీశాఖ అధికారులు చూడాలని, పొలాలలో గంజాయి సాగు చేయకుండా చూడాలని వ్యవసాయ అధికారులను కోరారు.

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, సంబంధిత జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.