​వేసవిలో విద్యుత్ అంతరాయం కలగకూడదు

— ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముష్రఫ్ అలీ ఫరూక్ ఆదేశం

అక్షరకలం నల్గొండ

రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో విద్యుదీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముష్రఫ్ అలీ ఫరూక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.​వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. వేసవిలో లోడ్ పెరిగే అవకాశం ఉన్నందున, విద్యుత్ ఉప కేంద్రాలు ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు.ఈదురు గాలుల వల్ల విద్యుత్ లైన్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కావున ఎక్కడా లూజ్ లైన్లు లేకుండా పటిష్టం చేయాలని ఆదేశించారు.వినియోగదారులకు ఎటువంటి అంతరాయం కలగకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.జిల్లాలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు వినియోగదారులకు అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో రెడ్ కో సీఎండీ వెన్నెల, చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, డైరెక్టర్లు శివాజీ, నరసింహ, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఇతర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.