బతుకమ్మ, ఆర్మూర్ : మీర్ధపల్లి వాసి మోత్కూరి నరేష్ గౌడ్ కూతురు సింధు పోటీ పరీక్షలకు హాజరై ప్రభుత్వఉద్యోగం పంచాయత్ రాజ్ లో ఏ ఈ ఇ గా ఉద్యోగం సాధించడం అభినంధనియO అని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ తెలిపారు. కర్ణం జగన్, పుప్పాల రాజేందర్, ఆలూరు పీఏ సి ఎస్ ఛైర్మెన్ టీ .శ్రీనివాస్, అర్ముర్ మండల ఎంపీటీసీ ఫోరమ్ మాజీ అధ్యక్షులు కేసి ముతేన్న, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, బీజేపీ నాయకులు భూషణ్ అర్ముర్ పట్టణం లో విద్య నగర్ కాలనీ లో నివాసం ఉంటున్న నరేష్ గౌడ్ ఇంటికి వెళ్లి సింధు ను శాలువాతో సన్మానించి, మిఠాయి తినిపించి అభినందిOచడం జరిగింది. 504 పోస్ట్ లకు దాదాపు 8వేల మంది పోటీ పడితే ఉద్యోగం పొందిన వారిలో మా నరేష్ కూతురు సింధు ఉండడం చాలా సంతోషం. బీటెక్ పూర్తి అయినా తరువాత రాత్రింబావాళ్ళు పుస్తకాలతో గడిపి, పట్టు వదలని విక్రమార్కుడిలా చదివి ఉద్యోగం పొందరని, సింధు సివిల్ సాధించడం తన ఆశయం అని తెలుపడం గొప్ప విషయమని, ఆశయాలు గొప్పగా పెట్టుకొని ఒక ప్రణాళికంగా చదువడం వాళ్ల అనుకున్నది సాధించడం వీలు అవుతుందని తెలిపారు.