పోస్టల్ ఉద్యోగి కిడ్నాప్

బతుకమ్మ న్యూస్ , బాన్సువాడ 

కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి కిడ్నాప్ వ్యవహరం కలకలం రేపింది. ఈ సంఘటన బాన్సువాడ మండలంలోని టీచర్స్ కాలనీలో గల పోస్టల్ ఉద్యోగి సాయినాథ్ ను  మంగళవారం ఉదయం నలుగురు దుండగులు కారులో వచ్చి  కిడ్నాప్ చేశారు.

ఉదయం వేళ తమ ఇంటి వద్ద నుంచే నలుగురు వ్యక్తులు తన భర్త  సాయినాథ్ భార్య కిడ్నాప్ చేశారని బాన్సువాడ  పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  పోస్టల్ ఉద్యోగి కిడ్నాప్ వెనుక తతంగమేంటనేది వెలుగులోకి రాలేదు. పోలీసులు కిడ్నాపర్ల కొరకు వెతుకుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.